Naga Chaitanya Wedding: నాగచైతన్య పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో ముస్తాబు!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2024 1:29 PM IST
Naga Chaitanya Wedding: నాగచైతన్య పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో ముస్తాబు!
X

Naga Chaitanya and Shobhita Dhulipala wedding venue: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరి పెళ్లి రాజస్థాన్‌లో జరుగుతుందని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ వేదిక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక పెళ్లి మండపం నిర్మిస్తున్నట్టు సమాచారం. దీని కోసం సినిమా రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే నాగచైతన్య కొంతమంది స్నేహితులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ను పంపించినట్టు తెలుస్తోంది. ఇక శోభిత ధూళిపాళ ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి సమయం కూడా దగ్గర పడుతుండడంతో.. పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అన్నపూర్ణ స్టూడియోను ముస్తాబు చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story