గ్రాండ్‌గా నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌.. ఫొటోలు షేర్‌ చేసిన నాగార్జున

నటి శోభిత ధూళిపాళ్లతో హీరో చైతన్య ఎంగేజ్‌మెంట్‌ ఇవాళ ఉదయం జరిగింది. నాగార్జున ఇంట్లోనే గ్రాండ్‌గా ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2024 1:37 PM IST
Naga Chaitanya And Sobhita Dhulipala Got Engaged
X

గ్రాండ్‌గా నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌.. ఫొటోలు షేర్‌ చేసిన నాగార్జున

Naga Chaitanya And Sobhita Dhulipala: త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు చైతు, శోభిత. నటి శోభిత ధూళిపాళ్లతో హీరో చైతన్య ఎంగేజ్‌మెంట్‌ ఇవాళ ఉదయం జరిగింది. నాగార్జున ఇంట్లోనే గ్రాండ్‌గా ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. మేజర్‌ సినిమా సమయంలో ఓ హౌస్‌ పార్టీలో చైతు, శోభిత కలిశారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. చైతన్య, శోభితకు త్వరలో వివాహం జరగనుంది. ఇక ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్టు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు అక్కినేని నాగార్జున. ఇదిలా ఉంటే.. 2021లో సమంతతో చైతన్య విడాకులు తీసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’’ అని నాగార్జున పేర్కొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story