Drugs Case: తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు క్లారిటీ

Naga Babu: బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 3 April 2022 6:22 PM IST
Naga Babu Reaction on Niharika Involvement in Drugs Case
X

Drugs Case: తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు క్లారిటీ

Naga Babu: బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున 3గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కూడా ఉన్నారు. పట్టుబడ్డవారిలో ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 150 మంది యువతీయువకులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

మరోవైపు ఈ పార్టీకి మెగా డాటర్ నిహారిక వెళ్లిన విషయాన్ని కన్ఫామ్ చేశారు నటుడు నాగబాబు. ఇందుకు సంబంధించి నాగబాబు స్పందించారు. ఓ వీడియో విడుదల చేసిన నాగబాబు.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని పోలీసులు చెప్పినట్టుగా తెలిపారు. పరిమిత సమయాన్ని మించి.. రన్ చేసిన కారణంగా పోలీసులు పబ్‌పై యాక్షన్ తీసుకున్నారని తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకూడదనే తాను వీడియో విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అనవసర ప్రచారాలు చేయవద్దని కోరారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story