Top
logo

నాగబాబుకి కరోనా పాజిటివ్.. మామయ్య మీరు వేగంగా కోలుకోవాలని..

నాగబాబుకి కరోనా పాజిటివ్.. మామయ్య మీరు వేగంగా కోలుకోవాలని..
X
Highlights

కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు....

కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా ప్రముఖ నటుడు, నిర్మాత మెగా బ్రదర్ నాగబాబు కొవిడ్‌-19 బారినపడ్డారు. సోషల్ మీడియా ద్వారా కరోనా సోకినట్లు తెలిపారు. కరోనాను జయించి, ప్లాస్మా దానం చేస్తానని ఈ సందర్భంగా నాగబాబు ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్‌కు మెగాభిమానులు స్పందిస్తూ.. త్వరగా కోలుకోవలని కామెంట్లు పెడుతున్నారు. నటుడు కల్యాణ్‌దేవ్‌ సైతం నాగబాబు మామయ్య మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్‌ చేశారు. మరోవైపు కల్యాణ్‌దేవ్‌ పెట్టిన కామెంట్‌పై నాగబాబు స్పందించారు. నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నందుకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చారు.
Web TitleNaga Babu Tests Positive for Coronavirus
Next Story