Naga Babu: జగన్ పై పట్టాభి వ్యాఖ్యలపట్ల మేం బాధపడ్డాం.. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం..

Naga Babu: రాజకీయాలలో విమర్శలు సహజమే కానీ అవి హద్దులు దాటి వ్యక్తిగత వ్యవహారాలపై దాడిగా మారకూడదన్నారు నటుడు నాగబాబు.

Arun Chilukuri
Published on: 20 Nov 2021 5:47 PM IST
Naga Babu Reaction on Chandrababu Tears
X

Naga Babu: జగన్ పై పట్టాభి వ్యాఖ్యలపట్ల మేం బాధపడ్డాం.. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం..

Naga Babu: రాజకీయాలలో విమర్శలు సహజమే కానీ అవి హద్దులు దాటి వ్యక్తిగత వ్యవహారాలపై దాడిగా మారకూడదన్నారు నటుడు నాగబాబు. గతంలో సీఎం జగన్ పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు తమను బాధించాయని అలాగే ఇప్పుడు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోడం తమను ఆవేదనకు గురి చేసిందనీ నాగబాబు అన్నారు. తాను ఒక జన సైనికుడిగానే ఈ అంశాలపై మాట్లాడుతున్నానన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ కుటుంబంపైనా మాటల దాడి జరిగిందని అన్నారు. నిందలు పడిన వారికే ఆ బాధ తెలుస్తుందన్నారు. అందుకే రాజకీయ నేతలు కేవలం రాజకీయాలవరకే విమర్శలకు పరిమితం చేస్తే మంచిదని నాగబాబు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story