Keerthy Suresh: కల్కిలో ఆఫర్‌ వచ్చింది కానీ తిరస్కరించా.. కీర్తి సురేష్‌ కీలక వ్యాఖ్యలు..!

Keerthy Suresh: ప్రభాస్‌ హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Aug 2024 1:55 PM IST
Nag Ashwin Offered Role for in Kalki , Actress Keerthy Suresh Interesting Comments
X

Keerthy Suresh: కల్కిలో ఆఫర్‌ వచ్చింది కానీ తిరస్కరించా.. కీర్తి సురేష్‌ కీలక వ్యాఖ్యలు..!

Keerthy Suresh: ప్రభాస్‌ హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సునామి కలెక్షన్లను రాబట్టింది. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందీ మూవీ. రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి తెలుగు వారి సత్తా చాటింది.

భారత్‌తో పాటు విదేశాల్లోనూ విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌, అమితాబ్‌, దీపికాతో పాటు మరెందరో స్టార్స్‌ కనిపించిన విషయం తెలిసిందే. స్క్రీన్ టైమ్‌ తక్కువ ఉన్నా విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మన్‌, రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ ఇలా చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. అయితే ఇందులో నటి కీర్తి సురేష్ మాత్రం కేవలం వాయిస్‌కు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. బుజ్జి కారు పాత్రకు కీర్తి సురేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం విధితమే.

అయితే కీర్తికి అంతకు ముందు కల్కిలో నటించే అవకాశం వచ్చినట్లు తాజాగా కీర్తి సురేష్‌ తెలిపింది. కల్కి మూవీ అనుకున్న సమయంలోనే నాగ అశ్విన్‌ తనను ఒకపాత్ర కోసం సంప్రదించారని, అయితే ఆ పాత్ర తాను చేయలేనని తెలిపానంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు ఇష్టమేనని మెసేజ్‌ చేశానని, దీంతో నాగ అశ్విన్‌ కాల్ చేసి ‘బుజ్జి’ రోల్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని అడిగారన్నారు.

కేవలం వాయిస్ ఓవర్‌ ఇస్తే చాలనేసరికి ఆశ్చర్యంగా అనిపించి వెంటనే ఎస్‌ చెప్పేశానని చెప్పుకొచ్చింది. వాయిస్‌ ఓవర్‌ విషయంలో నాగ్‌ అశ్విన్‌ తనకు ఎంతగానో సాయం చేశారని కీర్తి సురేష్‌ చెప్పొచ్చింది. అయితే నాగ అశ్విన్‌ తనకు ఆఫర్‌ చేసిన పాత్ర ఏంటో మాత్రం తాను చెప్పనని బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అసలు ఆ పాత్ర ఏమై ఉంటుందా.? అని అందరూ ఆలోచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story