Nabha Natesh: నేను సినిమాల్లో నటించకపోవడానికి కారణమదే..

* పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అంటున్న రామ్ హీరోయిన్

Dhatripriya
Updated on: 11 Jan 2023 6:31 PM IST
Nabha Natesh Says Thats Why I Gave A Break To Films
X

"అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చాను" అంటున్న నభ నటేష్ 

Nabha Natesh: గత కొంతకాలంగా ఒక మంచి హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలెంట్ ఉన్న హీరోయిన్లలో నభ నటేష్ కూడా ఒకరు. "నన్ను దోచుకుందువటే" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నభ ఇస్మార్ట్ శంకర్ డిస్కో రాజా వంటి సినిమాలలో నటించింది. ప్రతి సినిమాలో నూ నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న నభ కి అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు. ఆఖరిగా 2021లో నితిన్ హీరోగా నటించిన "మేస్ట్రో" సినిమాలో కనిపించిన నభ ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.

అయితే గత కొద్ది నెలలుగా నభ యాక్టింగ్ కి దూరం అవ్వడానికి గల కారణం ఆఫర్లు రాకపోవడం కాదని వేరొక పెద్ద రీజన్ ఉందని తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నభ దీని గురించి క్లారిటీ ఇచ్చింది. "గత ఏడాది నాకు చాలా కష్టంగా గడిచింది. నాకు చాలా పెద్ద ఆక్సిడెంట్ అయింది. నా ఎడమ భుజం లో మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్లు అయ్యాయి. దానివల్ల కొన్ని కష్టమైన సర్జరీలు కూడా జరిగాయి. ఫిసికల్ గా మరియు ఎమోషనల్ గా నేను చాలా పెయిన్ అనుభవించాను. ఈ దెబ్బల నుంచి బయటపడడానికి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చాను.

నాకు ఎంతో ఇష్టమైన సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవటం నాకు కూడా చాలా కష్టంగానే అనిపించింది, అని చెప్పిన నభ నటేష్ ఇకపై సినిమాలు చేస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడు తన ఆరోగ్యం కూడా కుదుటపడింది కాబట్టి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాను అని చెప్పుకొచ్చింది నభ.

Dhatripriya

Dhatripriya

Next Story