Oscars Nominations 2023: ఆస్కార్‌ బరిలో 'నాటు నాటు'.. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేషన్‌

Oscars Nominations 2023: మార్చి 13న ఆస్కార్‌ అవార్డుల ప్రదానం

Jyothi
Published on: 24 Jan 2023 7:55 PM IST
Naatu Naatu Song Nominated in the Best Original Song Category in Oscar Award 2023
X

Oscars Nominations 2023: ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు’.. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేషన్‌

Oscars Nominations 2023: దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎట్టకేలకు ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ టాప్‌ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ అందుకున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోయిన రాజమౌళి.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో అంతర్జాతీయ దర్శకుడిగా మారిపోయాడు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌ ఇండియన్స్‌తో పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది. అంతలా ఫిదా చేసింది కాబట్టే ఈ నాటు నాటు సాంగ్‌ను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించింది. అనుకున్నట్టే ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది.

Jyothi

Jyothi

Next Story