Bangarraju: బంగార్రాజు నుండి 'నా కోసం' సాంగ్ టీజర్

Bangarraju: బంగార్రాజు సినిమా నుంచి విడుదల చేసిన లడ్డుండా అనే పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేషమైన స్పందన వచ్చింది.

Sandeep Eggoju
Updated on: 29 Nov 2021 9:25 PM IST
Naa Kosam Song From Bangarraju will be out on December 1st
X

బంగార్రాజు సినిమా నుండి విడుదల కానున్న నాపాట సాంగ్ ప్రోమో 

Bangarraju: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా నుంచి విడుదల చేసిన లడ్డుండా అనే పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేషమైన స్పందన వచ్చింది. డిసెంబర్ 1న ఉదయం 11:12 గంటలకు రెండో పాట 'నా కోసం' టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. అనూప్ రూబెన్స్ అందమైన బాణీని సమకూర్చారు. మొదటిసారిగా నాగ చైతన్య, క‌ృతి శెట్టి జోడిగా కనిపించబోతోన్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా అనూప్ రూబెన్స్ మంచి పాటలను అందించనున్నారు.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు.మరోసారి 'బంగార్రాజు' చిత్రంలో ఈ ఇద్దరూ మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story