Uppena Success: ఉప్పెన స్టార్స్ కు భారీ బహుమతులు

Uppena Success: వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‘బేబమ్మ’ కృతీ శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబుకి టాలీవుడ్ లో ఉప్పెననే మొదటి సినిమా.

Venkata Chari
Published on: 27 Feb 2021 12:12 PM IST
Mythri Movies Makers Offers Large Amount for Uppena Stars
X

వైష్ణవ్‌ తేజ్‌, కృతీ శెట్టి (ఫోటో ట్విట్టర్)

Uppen Success: తొలి సినిమాతోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు'ఉప్పెన' హీరో, హీరోయిన్‌, డైరెక్టర్. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్'బేబమ్మ' కృతీ శెట్టి, సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ బుచ్చిబాబుకి టాలీవుడ్ లో ఉప్పెననే మొదటి సినిమా. భారీ అంచానాల మధ్య రిలీజైన ఈ సినిమా అదే రేంజ్‌లో సక్సెస్‌తోపాటు కలెక్షన్స్ కూడా సాధించింది. ఇప్పటి వరకు దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ హీరో, హీరోయిన్లకు స్పెషల్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారట. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరికి భారీ ఎమౌంట్‌ గిఫ్ట్‌గా ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలో హీరో వైష్ణవ్‌ తేజ్‌కి రూ. 1 కోటి .. హీరోయిన్‌ కృతీ శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఉప్పెన నిర్మాతలు స్పెషల్ చెక్స్‌ని వారికి అందించినట్లు సమాచారం. ఇదే వరుసలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారట.

కాగా, ఉప్పెన సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న 'పుష్ప', మహేష్‌ బాబు 'సర్కారు వారి పాట' ఉన్నాయి.


Venkata Chari

Venkata Chari

Next Story