Dil Raju: థియేటర్ల కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు దిల్ రాజు ని రిక్వెస్ట్ చేస్తారా?

Dil Raju: మైత్రి మూవీ మేకర్స్ వారికి హింట్ ఇచ్చిన దిల్ రాజు

Dhatripriya
Updated on: 31 Dec 2022 8:00 PM IST
Mythri Movie Makers Will Request Dil Raju For Theatres?
X

Dil Raju: థియేటర్ల కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు దిల్ రాజు ని రిక్వెస్ట్ చేస్తారా?

Dil Raju: టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రెండు సినిమాలను విడుదల చేస్తోంది. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నటించిన "వాల్తేరు వీరయ్య" కాగా మరొకటి నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన "వీర సింహారెడ్డి". ఈ రెండు సినిమాలలోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే మరోవైపు దిల్ రాజు కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "వారసుడు" ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా నే విడుదల కాబోతున్న అజిత్ "తునివు" సినిమాని తెలుగులో "తెగింపు" అనే టైటిల్ తో కూడా దిల్ రాజు విడుదల చేయబోతున్నారు. "వారసుడు" మరియు "తెగింపు" సినిమాలకు దిల్ రాజు ఎక్కువ థియేటర్లో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మీరు డిస్ట్రిబ్యూటర్లు అయితే ఎగ్జిబిటర్లను కానీ మిగతా డిస్ట్రిబ్యూటర్లను కానీ థియేటర్ల కోసం అడగాలి," అని అన్నారు ఇప్పుడు థియేటర్లు కావాల్సింది మైత్రి మూవీ మేకర్స్ వారికి. మరి మైత్రి మూవీ మేకర్స్ వారు దిల్ రాజుని థియేటర్ల కోసం రిక్వెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు అన్న మాటలో కూడా నిజం ఉంది. మరి మైత్రి మూవీ మేకర్స్ వారు దిల్ రాజు కోరినట్లు అడుగుతారా లేదా అనేది వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story