చిన్న సినిమాలతో భారీ నష్టాలు అందుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్

Mythri Movie Makers: చిన్న సినిమాలతో భారీ ఇబ్బందులు పడుతున్న మైత్రి మూవీ మేకర్స్

Jyothi
Published on: 11 April 2023 1:03 PM IST
Mythri Movie Makers Struggle with Smaller Films
X

చిన్న సినిమాలతో భారీ నష్టాలు అందుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్

Mythri Movie Makers: అతి తక్కువ కాలంలోనే బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "శ్రీ మంతుడు" సినిమాతో నిర్మాణంలోకి దిగిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తరువాత "జనతా గ్యారేజ్", "రంగస్థలం" వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాక మరోవైపు స్టార్ హీరోలతో చిన్న బడ్జెట్ సినిమాలు చేయడానికి కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు వెనుకాడరు.

కానీ గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న చిన్న సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. దీంతో నిర్మాతలకి భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. "హ్యాపీ బర్త్ డే", "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", "మీటర్" వంటి చిన్న సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ మూడు సినిమాల్లో డిజాస్టర్లు అందుకుంది. ఇందులో ఒక్క సినిమా కూడా కనీసం విడుదల ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.

దీంతో మైత్రి మూవీ మేకర్స్ వారికి భారీ నష్టాలు వాటిల్లాయి. ఈ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టినా మైత్రి మూవీ మేకర్స్ సినిమా కలెక్షన్లతో కొంత కూడా వెనకేసుకోలేకపోయింది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమా కూడా నెగిటివ్ షేర్స్ తోనే రన్ అవుతుంది. చూస్తూ ఉంటే చిన్న బడ్జెట్ సినిమాలతో మైత్రి మూవీ మేకర్స్ వారికి బాగానే ఇబ్బందులు కలుగుతున్నట్లు చెప్పుకోవచ్చు.

Jyothi

Jyothi

Next Story