NBK107 Movie Name: బాలకృష్ణ సినిమా టైటిల్ పుకార్ల పై స్పందించిన మైత్రి

* ఈ సినిమా కోసం "రౌడీయిజం" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా పుకార్లు వినిపించాయి

admin1
Updated on: 8 Oct 2021 6:26 PM IST
Mythri Movie Makers Responds to Balakrishna New Movie Title Rumors of NBK107
X

ఎన్బీకే107 సినిమా (ఫోటో- ది హన్స్ ఇండియా)

Balakrishna New Movie: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బిజీగా ఉన్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీ చంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణతో కూడా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం "రౌడీయిజం" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా పుకార్లు వినిపించాయి. తాజాగా చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు దీని గురించి రియాక్ట్ అయ్యారు. "#ఎన్బీకే107 సినిమా టైటిల్ గురించి వినిపిస్తున్న పుకార్లలో ఏ మాత్రం నిజం లేదు. కానీ ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు సినిమా టైటిల్ తో పాటు సినిమాకి సంబంధించి ఇతరత్రా వివరాలను కూడా తెలియజేస్తాము కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

admin1

admin1

Next Story