భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన #ఎన్బీకే107 బృందం

Mythri Movie Makers Reject The Tempting Offer For NBK107?
x

భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన #ఎన్బీకే107 బృందం

Highlights

డిస్ట్రిబ్యూషన్ ఆఫర్ కి నో చెప్పిన బాలయ్య నిర్మాతలు

NBK 107: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "అఖండ" సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మరియు బాలయ్య కాంబోలో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇచ్చిన భారీ ఆఫర్ ను నిర్మాతలు రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ ఏరియాస్ ల డిస్ట్రిబ్యూషన్ కోసం వారు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఎప్పుడూ అమ్మే రెగ్యులర్ బయర్స్ కు సినిమా రైట్స్ అమ్మాలని నిర్మాతలు ఫిక్స్ అయినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే భారీ ఆఫర్లను సైతం తిరస్కరించినట్లు తెలుస్తో్ంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరగబోతోంది. ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories