మళ్ళీ మెగా హీరోతో చేయి కలపనున్న మైత్రి

Ruthvik
Published on: 1 March 2019 3:10 PM IST
మళ్ళీ మెగా హీరోతో చేయి కలపనున్న మైత్రి
X

వరుస పెట్టి స్టార్ హీరోలు స్టార్ దర్శకులు సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ లు అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమా తర్వాత రెండు సినిమాలు 'సవ్యసాచి', 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మైత్రి వారి జోరు తగ్గింది అనుకుంటున్న సమయంలో మళ్లీ స్పీడు పెంచేశారు. వరుసపెట్టి మెగా హీరోలతో సినిమాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' సినిమా తీసిన మైత్రి వారు సాయిధరమ్ తేజ్ హీరోగా 'చిత్రాలహరి' సినిమాను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాక సాయిధరంతేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ని కూడా హీరోగా పరిచయం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ కూడా మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తరువాత అధికారిక ప్రకటన జూన్ లో వెలువడనుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'జిగర్తాండ' సినిమా రీమేక్ అయిన 'వాల్మీకి' తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

Ruthvik

Ruthvik

Next Story