Priyamani: ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది: ప్రియమణి

ప్రియమణి.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరు. చాలా సినిమాలు చేసినా... యమదొంగ తన కెరీర్‌లో ముందు వరుసలో ఉంటుంది.

Venkata Chari
Updated on: 31 May 2021 10:30 PM IST
My Dream Was Fulfilled With Narappa Movie Says Priyamani
X

ప్రియమణి (ఫొటో ట్విట్టర్)

Priyamani: ప్రియమణి.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరు. టాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసినా... యమదొంగ సినిమా మాత్రం తన కెరీర్‌లో మందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా తరువాత ప్రియమణి చేసిన సినిమాలేవీ ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల రాకతో ప్రియమణికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఆమె కన్నడ .. మలయాళ ఇండస్ట్రీలపై దృష్టిపెట్టింది. అక్కడ ఫుల్ బిజీగానే ఉంది. అలాగే వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగామారిపోతయింది. కొంత గ్యాప్ తరువాత ప్రియమణి తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా 'నారప్ప' సినిమాలో ప్రియమణి హీరో వెంకటేశ్ భార్య పాత్రలో సందడి చేయనుంది. ఈ పాత్రపై ఆమె మాట్లాడుతూ.. " విక్టరీ వెంకటేశ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. గతంలో కొన్ని అవకాశాలు వచ్చాయికానీ, చివరి నిమిషంలో చేజారిపోయాయి. ఇన్ని రోజులకు నా నిరీక్షణ ఫలించింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. నా పాత్రకు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఇక 'విరాటపర్వం' సినిమాలో భరతక్క పాత్రలో నటించాను. ఈ పాత్రకు కూడా మంచి పేరు వస్తుంద"నే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది ప్రియమణి.

Venkata Chari

Venkata Chari

Next Story