Roshan Meka: "నా తమ్ముడి సినిమా డైరెక్టర్ అతనే" అంటున్న శ్రీకాంత్ కొడుకు

Roshan Meka: తాజాగా ఇప్పుడు రోషన్ "పెళ్లి సందడి" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

admin1
Updated on: 12 Oct 2021 1:02 PM IST
My Brother Rohan Entry into Movies in Direction of Prabhu Deva Said Roshan | Tollywood News Today
X

Roshan Meka: "నా తమ్ముడి సినిమా డైరెక్టర్ అతనే" అంటున్న శ్రీకాంత్ కొడుకు

Roshan Meka: "నిర్మల కాన్వెంట్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన శ్రీకాంత్ తనయుడు రోషన్ మొదటి సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయాడు. తాజాగా ఇప్పుడు రోషన్ "పెళ్లి సందడి" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 15వ తారీఖున థియేటర్లలో విడుదల అవుతోంది. అయితే రోషన్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించి సూపర్ హిట్టయిన "దబాంగ్ త్రీ" సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి చాలా మందికి తెలియదు. ఒక యువ తెలుగు హీరో బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం నమ్మలేని విషయం.

"నేను ఒక సౌత్ ఇండియన్ ని అని చెప్తే ఎవ్వరు నమ్మే వాళ్ళు కాదు. సౌత్ ఇండియా లో నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు అని నేను చెప్తూ ఉండేవాడిని. అక్కడి వాళ్ళు అంతా నేను హృతిక్ రోషన్ లా ఉంటానని అనేవాళ్ళు" అని చెప్పుకొచ్చాడు రోషన్. ఇక మరోవైపు రోషన్ తమ్ముడు రోహన్ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రోహన్ మొదటి సినిమా ఉంటుందని ఆ సినిమా గురించిన వివరాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి అని తెలియజేశారు రోషన్.

admin1

admin1

Next Story