My Baby Movie Collections: కంటెంట్ ఉంటే క‌టౌట్‌తో ప‌నిలేదు.. రికార్డు క‌లెక్ష‌న్లతో దుమ్మురేపుతోన్న మై బేబీ మూవీ..!

My Baby Movie Collections: కంటెంట్ ఉంటే క‌టౌట్‌తో ప‌నిలేదు.. రికార్డు క‌లెక్ష‌న్లతో  దుమ్మురేపుతోన్న మై బేబీ మూవీ..!
x
Highlights

My Baby Movie Collections: అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం “మై బేబీ” జూలై 18, 2025న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

My Baby Movie Collections: అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం “మై బేబీ” జూలై 18, 2025న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజునుంచే విశేష స్పందనను సంపాదించుకుంది. నిర్మాత సురేష్ కొండేటి, సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టుతున్నారు.

విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 35 లక్షల వసూళ్లు సాధించి, ఇటీవల విడుదలైన చిన్న చిత్రాల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో సానుభూతి చెందుతున్నారు. అమ్మ ప్రేమ, నాన్న బాధ్యతల మధ్య సున్నితమైన బంధాన్ని హృదయాన్ని తాకేలా తెరకెక్కించిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది.

కొంతకాలం విరామం తర్వాత ఎస్.కె. పిక్చర్స్ మళ్లీ బరిలోకి దిగిన తొలి చిత్రం ఇది. అయినప్పటికీ, వారి బ్రాండ్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గని కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి కథ, భావోద్వేగాల మేళవింపు ఉంటే – తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఖచ్చితంగా లభిస్తుందని మళ్లీ నిరూపితమైంది.

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు..ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది చిత్ర బృందం. "ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు, మళ్లీ మా ప్రయాణాన్ని నమ్మకంగా ప్రారంభించే అవకాశాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు," అని వారు హర్షం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories