Mani Sharma - Mahathi: చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్న తండ్రీకొడుకులు

* ఒకేసారి రెండు జనరేషన్ లకు చెందిన వారితో పని చేస్తున్న చిరంజీవి

admin1
Updated on: 9 Oct 2021 12:42 PM IST
Music Directors Mani Sharma And Swara Sagar Mahathi Busy With Chiranjeevi Upcoming Movies
X

చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్న తండ్రీకొడుకులు (ఫైల్ ఫోటో)

Chiranjeevi: ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లుసిఫర్" సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన "వేదాళం" సినిమాకి ఈ చిత్రం రీమేక్ గా రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సంగీతం ని అందించడానికి పాపులర్ మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ తనయుడైన మహతి స్వర సాగర్ ను రంగంలోకి దింపారు.

ఇప్పటికే "ఛలో", "కుమారి 21ఎఫ్" వంటి మ్యూజికల్ హిట్స్ కి సంగీతాన్ని అందించిన మహతి స్వర సాగర్ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ మరో సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. అయితే మరోవైపు మణిశర్మ మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే మెగాస్టార్ ఒకేసారి రెండు జనరేషన్లకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చేస్తున్నారు. ఒకవైపు మణిశర్మ మాత్రమే కాక మరోవైపు ఆయన కుమారుడు మహతి కూడా చిరు సినిమాతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story