Balakrishna: తమన్‌కు బాలకృష్ణ సర్‌ప్రైజ్ గిఫ్ట్..

Music Director Thaman Gets Costly Car As Gift By Nandamuri Balakrishna
x

తమన్‌కు బాలకృష్ణ సర్‌ప్రైజ్ గిఫ్ట్..

Highlights

హీరో నందమూరి బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల బాలయ్య వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు.

Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల బాలయ్య వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. బాలకృష్ణ సినిమాలకు తమన్ ఇచ్చే సంగీతం ఏ రేంజ్ లో ఉంటుంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. వరుస సినిమాలతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. తాజాగా డాకు మహరాజ్ తో మరో విజయాన్ని అందుకున్న బాలయ్య చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తన సినిమాలు హిట్ కావడానికి తమన్ సంగీతం ఫ్లస్ అయిందని భావించిన బాలయ్య.. తమన్ కు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఇటీవల డాకు మహారాజ్ మూవీ ఈవెంట్‌లో సైతం తమన్ పై ప్రశంసలు కురిపించారు బాలయ్య. అంతేకాదు ఎన్బీకే తమన్ అంటూ పేరు పెట్టారు. అతనిపై ఉన్న అభిమానంతో కాస్ట్‌లీ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారు విలువు రూ. కోటికి పైగా ఉంటుందని సమాచారం. న్యూ బ్రాండెడ్ పోర్చ్సే కారును స్వయంగా కొని రిజిస్ట్రేషన్ చేసి మరీ తమన్‌కు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన బాలయ్య, తమన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరి కాంబోలో మరిన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు.

తమన్, బాలయ్య కాంబోలో ఇప్పటి వరకు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలు వచ్చాయి. ఇవి అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలు హిట్ కావడానికి తమన్ సంగీతం కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. వరుసగా బాలకృష్ణకు మంచి హిట్ ఇచ్చిన కారణంగా బాలకృష్ణకు తమన్ సెంటిమెంట్‌గా మారిపోయారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి కూడా తమన్‌నే సంగీతం అందిస్తున్నారు. దీంతో అఖండ 2కి కూడా థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలు కావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

అఖండ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 తెరకెక్కోతంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories