Thaman: మీమర్‌కు ఘాటుగా సమాధానమిచ్చిన తమన్

Thaman: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై సెటైర్లు వేయడం చాలా మందికి అలవాటుగా మారింది.

Venkata Chari
Published on: 9 May 2021 8:49 PM IST
Music Director SS Thaman Strong Reply For Memer
X

థమన్ (ఫొటో ట్విట్టర్)

Thaman: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై సెటైర్లు వేయడం చాలా మందికి అలవాటుగా మారింది. అదే పనిగా విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు. తాజాగా సంగీత దర్శకుడు థమన్‌పై ఓ నెటిజన్‌ మీమ్స్ తో విమర్శలు గుప్పించాడు. దీంతో ఆ మీమర్‌కు ఘాటుగానే సమధానమిచ్చాడు తమన్.

వివరాల్లోకి వెళ్తే.. ఇందులో కింగ్‌ సినిమాలో బ్రహ్మానందం చేసిన కాపీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో మీమ్స్ ఉన్నాయి. రేప్పొద్దున తన పిల్లలకు ఇతనే థమన్‌ అని చూపిస్తాను అని.. సదరు నెటిజన్‌ విమర్శంచాడు. దీంతో సదరు మీమర్‌కి ఘాటుగా రిప్లై కౌంటర్ ఇచ్చాడు థమన్. 'దయచేసి నీ భార్యకు ఇలా మీమ్స్‌ చేసుకుంటూ ఉన్నానని చెప్పు బ్రో.. అప్పుడామె ఇలాంటి పనికి మాలిన మీమర్‌ను పెళ్లి చేసుకున్నానేంటా? అని చాలా గర్వపడుతుంది' అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో థమన్ ఫ్యాన్స్ చాలా మంచి పనిచేశామంటూ పోగడ్తలతో ముంచేత్తుతున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story