Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమాలో రాజీ పడేదే లేదు అంటున్న థమన్

Sarkaru Vaari Paata Movie: "సర్కారు వారి పాట" మ్యూజిక్ గురించి స్పందించిన థమన్

admin1
Published on: 11 Nov 2021 12:31 PM IST
Music Director SS Thaman Says not Compromising of Sarkaru Vaari Paata Movie Songs - Movie News Today
X

 "సర్కారు వారి పాట" మ్యూజిక్ గురించి స్పందించిన థమన్(ఫైల్ ఫోటో)

SS Thaman - Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా నిలదీస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా థమన్ ని సినిమా గురించి అడిగాడు.

"హాయ్ అన్నా. నీ స్టైల్ లో 'సర్కారు వారి పాట' మ్యూజిక్ ఎలా ఉండబోతోందో చెప్పు. సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి? మొదటి పాటని ఎప్పుడు విడుదల చేస్తారు?" అని ఒక ఫ్యాన్ అడగగా దానికి థమన్, "ప్రస్తుతం ప్రమోషనల్ స్ట్రాటజీలతో బిజీగా ఉన్నాం బ్రదర్. ఈ సినిమా మాకు చాలా పెద్దది. అందులోనూ మన సూపర్ స్టార్ మాస్ ఫామ్ లో కనిపించబోతున్నారు.అందుకే ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు.

మిగతా విషయాల గురించి క్లారిటీ రాగానే ప్రకటిస్తాం" అని అన్నారు. ఇప్పటికే మహేష్ బాబు సినిమాలకు థమన్ అందించిన పాటలు చాలానే చార్ట్ బస్టర్ లు అయ్యాయి. ఈ సినిమాకి కూడా థమన్ అదిరిపోయే సంగీతం ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

admin1

admin1

Next Story