Akandha Songs - SS Thaman: అఖండ సినిమాతో థియేటర్లలను దద్దరిల్లించిన థమన్

admin1
Updated on: 3 Dec 2021 6:31 PM IST
Music Director SS Thaman Rocked the Theaters With Balakrishna Akhanda Movie Songs
X

Akandha Songs - Thaman: అఖండ సినిమాతో థియేటర్లలను దద్దరిల్లించిన థమన్

Akandha Songs - SS Thaman: మిగతా సంగీత దర్శకులతో పోలిస్తే ఎస్.ఎస్. థమన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలకి సంగీతాన్ని అందిస్తున్న థమన్ ఒకప్పుడు ఎన్నో విమర్శలను అందుకున్నారు. కానీ అవన్నీ భరించి తనకుతానుగా బయటికి వచ్చి తనని విమర్శించిన వారితోనే ప్రశంసలను పొందాడు. గత కొన్నేళ్లలో థమన్ ఆడియోలు అన్ని సూపర్ హిట్ లుగా మారాయి. తాజాగా విడుదలైన "అఖండ" సినిమా కి కూడా తమన్ సంగీతం కి చాలా మంచి పేరు వచ్చింది. సినిమా హిట్ అవడానికి గల కారణాల్లో థమన్ సంగీతం కూడా ఒకటి అని అభిమానులు విశ్లేషిస్తున్నారు.

ప్రతి సన్నివేశాన్ని ఎస్.ఎస్.తమన్ తన నేపథ్య సంగీతంతో చాలా బాగా ఎలివేట్ చేశారు. హీరో ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ దాకా ఆర్ ఆర్ థియేటర్ల దద్ధరిల్లేలా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ ముందు సన్నివేశంలో థమన్ సంగీతం ఇంకో లెవల్ అని చెప్పవచ్చు. ఇక బాలయ్య శివతాండవం చేస్తున్నప్పుడు బ్యాగ్రౌండ్ స్కోరు, సౌండ్, హమ్మింగ్, అన్ని అదిరిపోయాయి. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి సన్నివేశంలోనూ థమన్ మార్క్ సంగీతం కనిపిస్తుంది. బాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమేకాక పాటల విషయంలో కూడా థమన్ మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇలా ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు థమన్.

admin1

admin1

Next Story