Radhe Shyam - Thaman: "రాధేశ్యామ్" కోసం ముందుకు వచ్చిన థమన్

* థమన్ ను రంగంలోకి దింపనున్న ప్రభాస్

admin1
Updated on: 13 Dec 2021 10:00 PM IST
Radhe Shyam - Thaman: రాధేశ్యామ్ కోసం ముందుకు వచ్చిన థమన్
X

Radhe Shyam - Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ కోసం క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తప్ప మిగతా అందరు హీరోలతో కలిసి పనిచేశారు థమన్. ఇంతకు ముందు 'రెబల్' సినిమాకి తానే సంగీతాన్ని అందించాలి. కానీ ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలిపారు థమన్. కానీ ప్రభాస్ తో మాత్రం భవిష్యత్తులో కచ్చితంగా కలిసి పని చేస్తాను అని చెప్పుకొచ్చారు థమన్. ఇప్పుడు ఆ మాటలే నిజం కాబోతున్నాయి.

ఈ మధ్య ప్రభాస్ తన ఒక్కో సినిమా కోసం వేరువేరు సంగీతదర్శకులను ఎంపిక చేస్తున్నారు. రాధే శ్యామ్ కి కూడా ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. తెలుగు వెర్షన్ పాటలని జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేస్తుండగా, హిందీ వెర్షన్ కి వస్తే మిథున్, ఆమాల్ మాలిక్, అర్జిత్ సింగ్, మాన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో థమన్ కూడా చేరాడు. ఈ సినిమాకి నేపధ్య సంగీతం అందించడానికి ముందుకు వచ్చాడు థమన్. నేపథ్య సంగీతం హిట్ అయితే ప్రభాస్ మళ్లీ థమన్ తో పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

admin1

admin1

Next Story