బన్నీ ఫాన్స్ గెట్ రెడీ... 'అల వైకుంఠపురములో' నుంచి మరో సర్‌ప్రైజ్!

బన్నీ ఫాన్స్ గెట్ రెడీ... అల వైకుంఠపురములో నుంచి మరో సర్‌ప్రైజ్!
x

Ala Vaikunthapurramuloo

Highlights

Ala Vaikunthapurramuloo : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'

Ala Vaikunthapurramuloo : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు, తమన్ సంగీతం ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఇండస్ట్రీ లోనే అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలచింది ఈ సినిమా..

అయితే ఈ సినిమా విడుదలకి ముందు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయి సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.. ఎక్కడ చూసిన సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు వినిపించాయి.. ఇప్పటికే ఈ పాటలు చాలా రికార్డులను సృష్టించాయి.. అయితే అభిమానులకి మరో మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి తమన్ సిద్దం అయ్యాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లుగా తమన్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.


ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే ఓ సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories