MM Keeravani: ఒక్క సినిమాకి కీరవాణి తీసుకునే పారితోషికం ఇంతా?!

MM Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులలో కీరవాణి ఒకరు.

admin1
Updated on: 4 Aug 2021 8:01 PM IST
Music Director Keeravani to get a Huge Remuneration for the RRR Movie
X

MM Keeravani: ఒక్క సినిమాకి కీరవాణి తీసుకునే పారితోషికం ఇంతా?!

MM Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులలో కీరవాణి ఒకరు. మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా కీరవాణి సంగీతనికి తిరుగు లేదు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి కీరవాణి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. తన వద్దకు వచ్చిన ప్రతి సినిమానూ అంగీకరించకుండా చాలా వరకు రాజమౌళి సినిమాలకు మాత్రమే సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమాలతో కీరవాణికి ఆదాయం బాగానే వస్తుందా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం కీరవాణి కి ఏమాత్రం తక్కువ రావట్లేదు అని మరికొందరు అంటున్నారు.

అయితే సినిమాకు ఇంత రెమ్యూనరేషన్ అని కాకుండా రాజమౌళి కుటుంబంలోని అందరూ లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటారని అందరికి తెలిసిందే. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతూనే ఉంది కాబట్టి వారికి ఆదాయం కూడా బాగానే ముడుతుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం కీరవాణి తను సంగీతం అందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు రికార్డు స్థాయిలో వాటా కింద ఏకంగా రూ.18 కోట్లు తీసుకోబోతున్నారట. ఓ భారతీయ సంగీత దర్శకుడికి అందులోను టాలీవుడ్ లో ఈ స్థాయి పారితోషకం అంటే అది నిజంగానే రికార్డు అని చెప్పాలి.

admin1

admin1

Next Story