logo

అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తా అంటున్న దేవిశ్రీప్రసాద్

అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తా అంటున్న దేవిశ్రీప్రసాద్
Highlights

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమా వేడుకల్లో స్టేజ్ పైన పాడుతూ డాన్స్ చేయడమే కాకుండా కొన్ని...

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమా వేడుకల్లో స్టేజ్ పైన పాడుతూ డాన్స్ చేయడమే కాకుండా కొన్ని సినిమాలలో కూడా తెరపై కనిపించాడు. అయితే రాక్ స్టార్ గా ఎదిగిన దేవిశ్రీ ఒకటో రెండో సినిమాల్లో మాత్రమే వెండి తెరపై కనిపించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఒక పాటలో తెరపై కనిపించిన దేవిశ్రీ ఇప్పుడు ఏకంగా హీరోగా మారబోతున్నాడు అని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కి మంచి స్నేహితుడైన డైరెక్టర్ సుకుమార్ స్వయంగా డిఎస్పి హీరోగా లాంచ్ చేయబోతున్నారని టాక్.

దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ తాజాగా డి.ఎస్.పి ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే చాలా మంది దర్శకనిర్మాతలు మంచి స్క్రిప్టులతో తనవద్దకు వచ్చారని చెప్పిన దేవిశ్రీ తనకు మ్యూజిక్ పైన తప్ప ఇంక దేని మీద దృష్టి లేదని స్పష్టం చేశాడు. అయితే హాలీవుడ్ సినిమా రేంజ్ లో మ్యూజిక్ సినిమా ఏమైనా వస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని దేవిశ్రీప్రసాద్ కుండ బద్దలు కొట్టేశాడు. మరి అలాంటి కథతో ఏ దర్శకుడు అయినా దేవిశ్రీ వద్దకు వస్తాడో లేదో చూడాలి.


లైవ్ టీవి


Share it
Top