Murugadoss: వింత జీవి ప్రధాన పాత్రలో మురుగదాస్ సినిమా

* మరొక ప్రయోగాత్మక సినిమాతో మురుగదాస్

admin1
Updated on: 2 Oct 2021 9:30 PM IST
Murugadoss Movie Starring a Strange Creature in the Lead Role
X

మురుగదాస్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Murugadoss: తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేయడంలో ముందు వరుసలో ఉండే దర్శకులలో ఏఆర్ మురుగదాస్ పేరు కచ్చితంగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రయోగాత్మక సినిమాల మీద కూడా అంతే దృష్టి పెడుతున్నారు మురుగదాస్. అయితే ఎ.ఆర్.మురుగదాస్ ఈసారి ఏకంగా ఒక యానిమేటెడ్ పాత్రతో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. జురాసిక్ పార్క్, కింగ్ కాంగ్ తరహాలో ఏఆర్ మురుగదాస్ సినిమాలో కూడా ఒక వింత జీవి ఉండబోతుందట.

ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా మిగతా నటీనటులు సినిమాలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. అతి త్వరలోనే ఎ.ఆర్.మురుగదాస్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ని విడుదల చేయబోతున్నారు. అన్నీ అనుకున్న విధంగా సాగితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుండి మొదలు కాబోతుంది. ప్రకారం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కథ మరియు నటీనటుల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

admin1

admin1

Next Story