Madrasi Movie: గెట్ రెడీ ఫర్ ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ మదరాసి

Madrasi Movie: గెట్ రెడీ ఫర్ ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ మదరాసి
x

Madrasi Movie: గెట్ రెడీ ఫర్ ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ మదరాసి

Highlights

Madarasi Movie: టాలీవుడ్‌కి కూడా సుపరిచితుడు అయిన కోలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ 'మురుగదాస్'.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నారు.

Madarasi Movie: టాలీవుడ్‌కి కూడా సుపరిచితుడు అయిన కోలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ 'మురుగదాస్'.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి. సోషల్ కాజ్ సబ్జెక్ట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌ జోడించి.. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి సినిమాలతో సంచలనం సృష్టించారు మురుగదాస్. తెలుగులో కూడా డబ్ అయి ఘన విజయాన్ని సాధించాయి ఈ చిత్రాలు.

అంతేకాదు.. ఆయన సినిమాలను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తమిళ్ బ్లాక్ బస్టర్ 'రమణ' రీమేక్‌గా 'ఠాగూర్' చిత్రం తెరకెక్కగా.. మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిల్మ్ 'ఖైదీ 150', 'కత్తి' రీమేక్‌గా రూపొందింది. ఇక మురుగదాస్ తెలుగులో మెగాస్టార్‌తో చేసిన స్ట్రెయిట్ ఫిల్మ్ 'స్టాలిన్' మంచి విజయాన్ని సాధించింది. అలాగే.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'స్పైడర్' లాంటి సినిమా చేశారు. అయితే.. ఇక్కడి నుంచే మురుగదాస్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్పైడర్ తర్వాత చేసిన సర్కార్, దర్బార్, సికిందర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కానీ ఈసారి మురుగదాస్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్‌తో ఆయన తెరకెక్కించిన 'మదరాసి' సినిమా సెప్టెంబర్ 5న, అంటే రేపే రిలీజ్ కాబోతోంది. అమరన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టిజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేసింది. మురుగదాస్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్‌ సంస్థ పై నిర్మాత ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మొత్తంగా.. తమిళ్‌తో పాటు తెలుగులో సూపర్ బజ్‌తో రాబోతున్న 'మదరాసి' ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories