Mumbai Police: బిగ్ బి, అనుష్క బైక్ రైడ్.. ముంబై పోలీసులు సీరియస్..

Mumbai Police: తాము ఒకటి తలిస్తే..మరొకటి ఎదురయిందని బిగ్ బి అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ వర్రీ ఔతున్నారు.

Arun Chilukuri
Updated on: 16 May 2023 5:45 PM IST
Mumbai Police To Take Action on Amitabh, Anushka Riding Bike Without Helmet
X

Mumbai Police: బిగ్ బి, అనుష్క బైక్ రైడ్.. ముంబై పోలీసులు సీరియస్..

Mumbai Police: తాము ఒకటి తలిస్తే..మరొకటి ఎదురయిందని బిగ్ బి అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ వర్రీ ఔతున్నారు. బాలీవుడ్ నటీనటులకు పంక్చువాలిటీ ఉండదని..షూటింగ్ స్పాట్ కి టైమ్ కి రారని..వారిపై అపవాదు ఉంది. బాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం సౌత్ లో సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు..ఇదే చెబుతుంటారు..సౌత్ వాళ్లకి టైమ్ అంటే టైమ్..చెప్పిన టైమ్ కి ఎంత పెద్ద స్టార్ అయినా సెట్స్ పైకి వచ్చేస్తారు..సౌత్ కి నార్త్ కి ఇదే బిగ్ డిఫరెన్స్ అని పలువురు బిటౌన్ సెలబ్రిటీలు సభాముఖంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..

బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాత్రం టైమ్ విషయంలో చాలా పంక్చువల్ గా ఉంటారు. కానీ, ముంబై ట్రాఫిక్ లో ఇరుక్కొని చాలా సందర్భాల్లో షూటింగ్ స్పాట్ కి లేట్ గా వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఈ సంగతి అలా ఉంచితే..షూటింగ్ స్పాట్ కి కారులో బయల్దేరిన అమితాబ్ ముంబై ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన కారు దిగి అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తిని సహాయం అడగడంతో ఆ వ్యక్తి అమితాబ్ కు లిఫ్ట్ ఇచ్చి..షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని షేర్ చేసిన అమితాబ్...సదరు వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు.

బిగ్ బి సంగతి అలా ఉంచితే అనుష్క శర్మ కూడా సేమ్ టు సేమ్ ఇలానే చేసింది. తన కారును పక్కన పెట్టేసి బాడీగార్డ్ బైక్ పై ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ రెండు సంఘటనలపై ముంబై పోలీసులు సీరియస్ అయ్యారు. అదేంటి, టైమ్ కు వాల్యూ ఇచ్చి అమితాబ్, అనుష్క తమ సెలబ్రిటీ హోదాను కూడా పక్కన పెట్టేసి బైక్ పై ట్రావెల్ చేస్తే ముంబై పోలీసులు ఎందుకు గుస్సా అవుతున్నారని మీకు అనుమానంగా ఉంది కదా..వీరు టైమ్ కి వాల్యూ ఇచ్చిన మాట ఎంత వాస్తవమో...ముంబై ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించారనేది కూడా అంతే వాస్తవం..అందుకే ముంబై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.

ముంబైలో బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని నిబంధన ఉంది. ఈ నిబంధనలు పట్టించుకోకుండా బిగ్ బి బైక్ ఎక్కి కూర్చున్నాడు. బిగ్ బి కి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా హెల్మెట్ ధరించలేదు. అనుష్క విషయంలో కూడా అంతే..అనుష్క, ఆమె బాడీగార్డు ఇద్దరూ హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్స్...నిబంధనలు కేవలం సాధారణ వ్యక్తులకేనా..సెలబ్రిటీలకు వర్తించవా అని ప్రశ్నించారు. అంతేకాదు ఈ వీడియోలను ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని...అమితాబ్, అనుష్కలపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story