Mugguru Monagallu Movie: 'ముగ్గురు మొనగాళ్లు' ఫస్ట్ లుక్ విడుదల

Mugguru Monagallu: టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టి నుంచో సుప‌రిచితుడే.

Samba Siva Rao
Updated on: 17 May 2021 5:50 PM IST
Mugguru Monagallu First Look Poster
X

ముగ్గురు మొనగాళ్లు

Mugguru Monagallu: టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టి నుంచో సుప‌రిచితుడే. శ్రీనివాస్ రెడ్డి కడుపుబ్బా నవ్విస్తూనే.. హీరోగా సినిమాలు చేస్తుంటాడు. ఇప్పటికే హీరోగా శ్రీనివాస్ రెడ్డి గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ వంటి సినిమాలు చేశాడు. అంతేకాదు రెడ్డి హీరోగా న‌టించిన రెండు చిత్రాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

ఇక తాజాగా కామెడీ నేపథ్యంలో 'ముగ్గురు మొనగాళ్లు' అనే సినిమాతో ప్రేక్షకులను ముంద‌కురాబోతున్నాడు. తాజాగా మేకర్స్ 'ముగ్గురు మొనగాళ్లు' సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల చేశారు.ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త‌ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. త్విష్ శర్మ, శ్వేతా వర్మ ఈ సినిమాలో హీరోయిన్స్ గా కనిపించనున్నారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్ లో శ్రీనివాస రెడ్డి, దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు కనిపిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఫస్ట్ లుక్ చూసినట్లయితే.. శ్రీనివాసరెడ్డికి వినపడదు.. దీక్షిత్ శెట్టి మూగవాడు.. వెన్నెల రామారావుకు కనపడదు. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు మేకర్స్ ఇంటరెస్ట్ క్రియేట్ చేశారు. గరుడవేగ ఫేమ్ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సారి శ్రీనివాస్ రెడ్డి 'ముగ్గురు మొనగాళ్లు' తో ఏం మ్యాజిక్ చేయ‌బోతున్నాడో చూడాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్ల స‌మాచారం.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story