Jr NTR: ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మేలో ప్రారంభం

Much needed clarity on NTRs next
x

జూనియర్ ఎన్టీఆర్ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

NTR: టాలీవుడ్ లో ప్రస్తుతం హరిక & హాసిన్ క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు అగ్రశ్రేణి ప్రొడక్షన్ బ్యానర్లు.

Jr NTR: టాలీవుడ్ లో ప్రస్తుతం హరిక & హాసిన్ క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు అగ్రశ్రేణి ప్రొడక్షన్ బ్యానర్లు. ఎస్ రాధాకృష్ణ హరిక & హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నారు.

సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో వంటి సినిమాలు ఈ ప్రొడక్షన్ బ్యానర్‌లోనే విడుదలయ్యాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కూడా అందులో భాగమైంది. ఈ ప్రొడక్షన్ బ్యానర్ 'జెర్సీ' వంటి మధ్య తరహా సినిమాలకు ప్రసిద్ది చెందింది. ఈ సినిమాకు ఇటీవల జాతీయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, జెర్సీ మూవీకి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా బ్యానర్ లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పన్ కోషియం' రీమేక్ లో నటించేందుకు పవన్ కళ్యాణ్, రానా చేతులు కలిపారు. మరోవైపు, హరిక & హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. నాగ వంశీ ఈ రెండు చిత్రాల గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు వెల్లడించారు.

పవన్, రానా సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయిందని, అవుట్‌ పుట్ కూడా చాలా బాగొచ్చిందని పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఎన్‌టిఆర్-త్రివిక్రమ్ కాంబో లో చిత్రం ఏప్రిల్ చివరి వారం లేదా మే ఆరంభం నుంచి ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories