Mrunal Thakur : తన బాడీపై మృణాల్ వ్యాఖ్యలు.. పేరు చెప్పకుండానే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బిపాషా బసు!

Mrunal Thakurs Old Video on Bipasha Basus Body Resurfaces
x

Mrunal Thakur : తన బాడీపై మృణాల్ వ్యాఖ్యలు.. పేరు చెప్పకుండానే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బిపాషా బసు!

Highlights

Mrunal Thakur : తన బాడీపై మృణాల్ వ్యాఖ్యలు.. పేరు చెప్పకుండానే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బిపాషా బసు!

Mrunal Thakur : హిందీ కుంకుమ్ భాగ్య సీరియల్‌లో సపోర్టింగ్ పాత్ర నుంచి మొదలుపెట్టి బాలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి మృణాల్ ఠాకూర్. నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఇటీవల ఒక పాత వీడియో కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ వీడియోలో ఆమె సహనటి బిపాషా బసు బాడీ షేమింగ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బిపాషాకు మగవాళ్లలాంటి శరీరం, కండలు ఉన్నాయని మృణాల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు, ఈ వివాదంపై బిపాషా బసు స్పందించారు. మృణాల్ పేరు ప్రస్తావించకుండానే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ ద్వారా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలో మృణాల్ ఠాకూర్ ఒక వ్యక్తితో సంభాషిస్తున్నారు. ఆ వ్యక్తి బిపాషా బసును పొగుడుతూ ఉండగా, మృణాల్ మధ్యలో కల్పించుకుని, "నేను బిపాషా కంటే చాలా బెటర్. మగవాడిలాంటి శరీరం, కండలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెళ్లి బిపాషా బసును పెళ్లి చేసుకోండి. నేను ఆమె కంటే ఎన్నో రెట్లు బెటర్" అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మృణాల్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. బాడీ షేమింగ్ చేయడం సరికాదని విమర్శించారు.

మృణాల్ వ్యాఖ్యల వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే, బిపాషా బసు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీక్ ఉమెన్స్ గురించి ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆమె ఆ పోస్ట్‌లో ఇలా రాశారు.. "స్ట్రాంగ్ ఉమెన్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. అందమైన మహిళలు తమ కండరాలను బలోపేతం చేసుకోవాలి. మనం బలంగా ఉండాలి. దృఢమైన కండరాలు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మహిళలు బలహీనంగా ఉండాలి లేదా బలహీనంగా కనిపించాలి అనే పాత ఆలోచనను విడిచిపెట్టండి. మహిళలు శారీరకంగా వీక్ గా ఉండాలనేది చాలా పాతకాలపు ఆలోచన" అని పేర్కొన్నారు. బిపాషా ఈ పోస్ట్‌లో మృణాల్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, ఈ పోస్ట్ మృణాల్ వ్యాఖ్యలకు సమాధానంగానే భావిస్తున్నారు.

సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమె సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో కనిపించినప్పటికీ, ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో మరికొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. మరోవైపు, బిపాషా బసు ఇప్పుడు సినిమాల్లో అంతగా చురుకుగా లేరు. ఆమె నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాదం ఆమె వ్యక్తిగత జీవితం, గత వ్యాఖ్యల గురించి మరోసారి చర్చకు దారితీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories