Mrunal Thakur: రౌడీ స్టార్ తో కలిసి భారీ ప్రయోగం చేస్తున్న మృణాల్

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ సీతగా సౌత్ మొత్తం పాపులరైంది.

Arun Chilukuri
Updated on: 14 Jun 2023 8:30 PM IST
Mrunal Thakur her Next Project With Vijay Deverakonda
X

Mrunal Thakur: రౌడీ స్టార్ తో కలిసి భారీ ప్రయోగం చేస్తున్న మృణాల్

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ సీతగా సౌత్ మొత్తం పాపులరైంది. సీతారామం హిట్ తో సౌత్, నార్త్ అంతగా హిట్ మెట్టెక్కింది. కట్ చేస్తే ఇప్పుడు తనకి అన్నీ మంచి శకునములే. మంచి నటులతో జోడీ కడుతూ, అంతకుమించేలా ఆఫర్స్ వస్తున్నాయి. మృణాల్‌ ఠాకూర్‌ మంచి నటే అయినా, బాలీవుడ్ లో తనకి చెప్పుకోదగ్గ ఆఫర్ తగల్లేదు. ఆమధ్య సూపర్ 30లో హ్రితిక్ తో ఈమధ్య అక్షయ్ తో జోడీ కట్టింది కాని, తనకి రావాల్సినంత పేరు, బ్రేక్ రాలేదు. కాని సౌత్ లో మాత్రం ఈ లేడీ పండగ చేసుకుంటోంది.

మృణాల్‌ ప్రజెంట్ నానితో జోడీకట్టింది. ఎమోషనల్ డ్రామా చేస్తోంది. ఓరకంగా సౌత్ లో బాలీవుడ్ హీరోయిన్ అడుగుపెడితే గ్లామర్ డాల్ గానేమిగిలే ఛాన్స్ ఉంది. కాని మృణాల్‌ వరుసగా దుల్కర్ సల్మాన్, నాని అంటూ పెర్పార్మర్స్ తో కలిసి ఎమోషన్ క్యారీ ఛేసే ఛాన్స్ లు పడుతోంది. మాస్ మూవీలతో హీరోయిన్లకు గ్లామర్ డాల్ గా పేరొస్తుంది. కాని అదే మూవీ ఫ్లాపైతే సీన్ రివర్స్. అదే ఎమోషనల్ డ్రామాల్లో మెరిస్తే మాత్రం రిజల్ట్ రివర్స్ అయినా రావాల్సిన పేరు వస్తుంది. అందుకే దుల్కర్ సల్మాన్,నాని అంటూ మంచి నటులతో, అంతకుమించేలా ఎమోషనల్ డ్రామాలు చేస్తోంది.

మృణాల్‌ ఠాకూర్‌ ప్రజెంట్ నాని మూవీ చేస్తూనే విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. ఈ హీరో కూడా న్యాచురల్ పెర్పార్మరే.. ఓరకంగా చూస్తే ఇటు నటన, అటు క్రేజ్, అలానే సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ అనిపించే కథలతో మృణాల్‌ ఠాకూర్‌ దూసుకెళుతోంది. నార్త్ లో దక్కని అద్రుష్టాన్ని ఇక్కడ పట్టేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story