Maruthi - Prabhas: మారుతితో ప్రభాస్ సినిమా కరెక్ట్ డెసిషన్ ఏనా?

Maruthi - Prabhas: "బాహుబలి" సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి...

Shireesha
Published on: 12 March 2022 12:19 PM IST
Movie with Maruthi is Correct Decision of Prabhas or Not | Prabhas Latest News
X

Maruthi - Prabhas: మారుతితో ప్రభాస్ సినిమా కరెక్ట్ డెసిషన్ ఏనా?

Maruthi - Prabhas: "బాహుబలి" సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కానీ అందులో ఒకటి కూడా అనుకున్న స్థాయిలో మెప్పించటం లేదు. "సాహో" సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద హిట్ అయినప్పటికీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక తాజాగా విడుదలైన "రాధే శ్యామ్" సినిమాకి కూడా అదే పరిస్థితి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సాహో" మొదటి రోజు నుంచి అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

కానీ "రాధే శ్యామ్" చాలా మామూలు రెస్పాన్స్ తో మొదలైంది. కేవలం ప్రభాస్ అభిమానులు తప్ప మిగతా వారు ఎవరు సినిమా చూడడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక మరోవైపు ప్రభాస్ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. అలానే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు మారుతి సినిమాలలో కనిపించవు.

కేవలం కామెడీ ఎంటర్టైనర్ లు తీయడంలో మాత్రమే మారుతి దిట్ట. మరి ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్ తో కామెడీ సినిమా అంటే అభిమానులు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాహో తర్వాత ఈ సినిమా కూడా ఒక కాస్ట్లీ మిస్టేక్ గా ప్రభాస్ కెరీర్ లో మిగులుతుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు.

Shireesha

Shireesha

Next Story