విజయ్ దేవరకొండ టైటిల్ కి వచ్చిన ఇబ్బందులు

విజయ్ దేవరకొండ టైటిల్ కి వచ్చిన ఇబ్బందులు
x
Highlights

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో లో 'హీరో'...

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో లో 'హీరో' అనే టైటిల్ తో ఒక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో లో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాక, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. మిగతా అన్ని భాషల గురించి పక్కన పెడితే తమిళంలో ఈ సినిమాకు అదే టైటిల్ తో విడుదల చేయడానికి కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కోలీవుడ్ లో మరో హీరో దీనికి కారణం.

తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా తన తదుపరి చిత్రానికి హీరో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పుడు శివకార్తికేయ లేదా విజయ్ దేవరకొండ వీరిలో ఒకరు తమ సినిమా టైటిల్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇద్దరు హీరోల్లో ఎవరు వెనక్కి తగ్గి టైటిల్ మార్చుకుంటారా అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గతంలో 'హీరో' అనే టైటిల్ తో సూపర్ హిట్ ను అందుకున్నారు. తర్వాత నితిన్ మరియు కొందరు చిన్న హీరోలు ఆ టైటిల్ ను ఉపయోగించుకున్నారు కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. మరి ఈ 'హీరో' టైటిల్ విజయ్ దేవరకొండ ఎంతవరకు పనికి వస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories