Bhola Shankar Movie: చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

Bhola Shankar Movie: "భోళా శంకర్" సినిమా లో బిగ్ బాస్ కంటెస్టెంట్ లోబో

admin1
Published on: 21 Dec 2021 3:54 PM IST
Movie Offer to Bigg Boss 5 Telugu Contestant Lobo in Chiranjeevi New Movie Bhola Shankar
X

చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

Lobo - Bhola Shankar Movie: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఈ మధ్యనే పూర్తయింది. వీజే సన్నీ ఈ సీజన్ కి విన్నర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే మొన్న ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే కి ఇంతకుముందు సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ లో నుండి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ లు కూడా వచ్చారు.

అందులో లోబో కూడా ఉన్నాడు. తన విభిన్నమైన హెయిర్ స్టైల్ మరియు డ్రెస్సింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించే లోబో ఒకసారి ఎలిమినేట్ అయి సీక్రెట్ రూమ్ లో ఉండి మళ్లీ హౌస్ లోకి వెళ్ళాడు. కానీ 8వ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు.

మళ్లీ నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి వచ్చిన లోబో నాగార్జునతో మాట్లాడుతూ తనకి చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అవకాశం వచ్చిందని, సినిమా లో చాలావరకు చిరంజీవి పాత్ర పక్కనే తన పాత్ర ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నట్లు తెలిపాడు లోబో.

ఇక నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో లోబో వాడిన "ఐ డోంట్ కేర్ జనాలు" అనే డైలాగ్ గుర్తు చేయగా ఆ డైలాగ్ అభిమానులలో తనని పాపులర్ అయ్యేలా చేసిందని, భోళా శంకర్ సినిమాలో కూడా తన పాత్ర ఆ డైలాగు చెబుతుందని చెప్పుకొచ్చాడు లోబో.

admin1

admin1

Next Story