Movie Artists Association: చీలిక దిశగా టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్?

Movie Artists Association: 'మా' ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కూడా వచ్చేశాయి.

Arun Chilukuri
Published on: 12 Oct 2021 4:34 PM IST
Movie Artists Association Towards the Split
X

Movie Artists Association: చీలిక దిశగా టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్?

Movie Artists Association: 'మా' ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉద్రిక్తతలు మాత్రం 'మా'ను వీడలేదు విభేదాలు ఏమాత్రం వదల్లేదు. మేమంతా ఒకటే కుటుంబం, ఇదంతా ఉమ్మడి ఫ్యామిలీ అంటూ పైకి చెబుతూనే అంతర్గతంగా కన్నెర్రజేస్తున్న పరిస్థితులే ఇప్పటికీ కనిపిస్తున్నాయి.! టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిజల్ట్స్ అనంతరం ప్రకాష్ రాజ్, మెగాబ్రదర్ రాజీనామా ఎపిసోడ్ కొత్త రచ్చకు దారి తీసినట్లు కనిపిస్తోంది.

ఆదివారం పోలింగ్ నుంచి ఫలితాల వరకూ ఇండస్ట్రీ మొత్తం ఆలింగనాలు, ఆత్మీయ పలకరింపులతో అంతా ముగిసిందనే అనుకున్నారంతా అయితే ఆఫ్టర్ రిజల్ట్స్ నాగబాబు, ప్రకాష్ రాజ్ రాజీనామా తో సమస్య సద్దుమణిగిందనుకున్నాం. కానీ ఇదే సమయంలో మంచు విష్ణు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఇద్దరి రాజీనామాలను ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో చిరంజీవి తనను పోటీ నుంచి తప్పుకోమన్నారంటూ సంచలన కామెంట్లు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తన సభ్యత్వానికి రాజీనామా వెనుక చాలా ట్విస్టుందంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఇంట్రస్టింగ్ ట్వీటే ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.

సాయంత్ర 5 గంటలు ఇప్పుడు మూవీ ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా అభిమాని ఎదురు చూస్తున్నది ఈ టైమ్ కోసమే.! దీనికి పెద్ద రీజనే ఉంది. 'మా' అసోసియేషన్ కు పోటీగా ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్ పెడతారనే ఊహాగానాలకు తోడు ఆత్మా అనే పేరు కూడా డిసైడ్ చేశారని వార్తలొస్తున్నాయి. దీంతో ప్రకాష్ రాజ్ ఐదు గంటలకు ఏం చెబుతారు అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో మంచు ఫ్యామిలీని నరేష్ తప్పుదోవ పట్టిస్తున్నారన్న జీవిత రాజశేఖర్ కామెంట్లు సైతం అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story