MAA Elections 2021: మా అసోసియేషన్ ఎన్నికల వివాదంలో ట్విస్ట్.. హేమకు షోకాజ్ నోటీస్..

MAA Elections 2021: మా అసోసియేషన్ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 10 Aug 2021 3:44 PM IST
Movie Artists Association (MAA) Issued Shockage Notice  to Actress Hema
X

మా అసోసియేషన్ ఎన్నికల వివాదంలో ట్విస్ట్

MAA Elections 2021: మా అసోసియేషన్ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మా అసోసియేషన్ పై బహిరంగ ప్రకటనలు చేసిన నటి హేమపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది మా సంస్థ. హేమకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మా సంస్థ నిధులపై హేమ బాహాటంగా సర్క్యులేట్ చేసిన ఆడియో అపీల్ కలకలం రేపింది. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారింది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా మా - పరిణామాలపై ఆగ్రహంలో ఉన్నట్లు తెలుస్తోంది. మా - ఇంటి గుట్టును వేదికలకెక్కి రచ్చ చేసే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు త్వరగా జరపాలని చిరంజీవి కృష్ణం రాజుకు లేఖ రాశారు. మా అసోసియేషన్ నిధులను నరేష్ పూర్తిగా ఖర్చు చేసేశారంటూ హేమ కామెంట్ చేశారు. దీనిపై జీవిత, నరేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే అంశంపై చిరంజీవి కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story