Prakash Raj: ప్రియమైన ప్రధాని మోదీ గారూ.. రైతుల కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా?

* కేసిఆర్ తీసుకున్న నిర్ణయం చాల బాగుంది అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.

Shilpa
Updated on: 21 Nov 2021 5:12 PM IST
Movie Actors Praising to Chief  Minister KCR on Decision Taken for Farmers
X

ప్రకాష్ రాజ్(ఫోటో - ది హన్స్ ఇండియా)

Prakash Raj: నూతన సాగు చట్టాలకు వ్యతిరేఖంగా ఉద్యమం చేసి అమరులైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరులైన రైతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఆర్థిక సహాయం చేయాలి అంటూ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. కేసిఆర్ తీసుకున్న నిర్ణయంపై స్పందించిన సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సమంత, ప్రకాశ్‌ రాజ్‌, నాని, రామ్‌, రానా ఆనందం వ్యక్తం చేస్తూ కేసిఆర్ తీసుకున్న నిర్ణయం చాల బాగుంది అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులపై ఆయనకున్న ప్రేమ తెలియజేస్తోంది'' అంటూ రామ్‌ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ప్రకాష్ రాజ్ కేసిఆర్ నిర్ణయంపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రియమైన ప్రధాన మంత్రి గారు క్షమాపణలు ఒక్కటే సరిపోవు, ఆ రైతుల కుటుంబ బాధ్యత మీరు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.



Shilpa

Shilpa

Next Story