తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోయిన హిందీ ప్రేక్షకులను మెప్పించిన మౌని రాయ్

Mouni Roy Did Not like the Telugu audience but pleased the Hindi audience
x

తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోయిన హిందీ ప్రేక్షకులను మెప్పించిన మౌని రాయ్

Highlights

*తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోయిన హిందీ ప్రేక్షకులను మెప్పించిన మౌని రాయ్

Mouni Roy: ఇప్పటిదాకా బాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మౌని రాయి తాజాగా ఇప్పుడు "బ్రహ్మాస్త్ర" సినిమాతో తెలుగులో కూడా అడుగు పెట్టింది. గతంలో తాను నటించిన "నాగిన్" సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకుంది. ఇక బుల్లితెర నుంచి ఏకంగా వెండితెరపై కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే నటనపరంగా మౌని కు మంచి మార్కులు లభించినప్పటికీ పాత్ర విజయంలో అభిమానులు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎంత విలన్ పాత్ర అయినప్పటికీ మౌని రాయ్ పాత్ర సెకండ్ హాఫ్ లో బాగా తేలిపోయినట్లు అనిపిస్తుంది.

ఇక తన పాత్రకి ఎమోషనల్ డెప్త్ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు ఆమె పాత్రకి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈమె నటనకి మరియు స్క్రీన్ ప్రజెన్స్ కి అభిమానులు ఫ్లాట్ అయిపోతున్నారు. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోయినప్పటికీ మౌని హిందీ ప్రేక్షకుల మనసులను మాత్రం ఆకట్టుకుంది. ఆఖరికి అమితాబచ్చన్, షారుఖ్ ఖాన్ కంటే మౌని రాయ్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నారు. ఏదేమైనా "బ్రహ్మాస్త్ర" సినిమా హిందీలో మౌని రాయ్ కి బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories