Mothers Day 2021: అపురూప చిత్రాలను పంచుకున్న సినీ తార‌లు

Mothers Day 2021:

Samba Siva Rao
Published on: 9 May 2021 3:57 PM IST
Actors Share his Pictures on Mothers Day Special
X

చిరంజీవి మరియు మహేష్ 

Mothers Day 2021: దేవుడు తాను ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకునే గొప్ప ఔదార్యత ఒక తల్లికే సాధ్యం. అమ్మ ప్రేమను సెలెబ్రేట్ చేసుకోవడానికి ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ జగాన్ని మరిపింపజేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన తల్లితో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తల్లి, కూతురు ,భార్యకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా తన తల్లితో దిగిన ఫోటోను షేర్ చేసాడు. ఈ ఫోటోలో వరుణ్ తేజ్ సోదరి నటి నిహారిక కూడా వుంది. ప్రస్తుతం సినీతారలు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story