Mood Of The Nation Poll : టాప్ లో అక్షయ్, దీపికా పదుకునే!

Mood Of The Nation Poll : ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్

Krishna
Published on: 8 Aug 2020 2:59 PM IST
Mood Of The Nation Poll : టాప్ లో అక్షయ్, దీపికా పదుకునే!
X
Deepika Padukone and akshay kumar (File Photo)

Mood Of The Nation Poll : ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించిన 'మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' సర్వేలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధమ స్థానంలో నిలిచాడు. అటు హీరోయిన్ లలో దీపికా పదుకునే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అత్యంత ప్రజాదరణ గల స్టార్స్ ఎవ‌ర‌నే దానిపై స‌ర్వే చేయ‌గా వీరు అగ్రస్థానాన్ని ఆఆక్రమించారు. ఇక ఈ సర్వేలో అక్షయ్ కుమార్ 24 శాతం ఓట్లు వచ్చాయి.

ఆ తర్వాత అమితాబ్ బ‌చ్చన్ 23 శాతం ఓట్లతో ఉండగా, షారుఖ్‌ ఖాన్‌- 11, సల్మాన్‌ ఖాన్‌- 10, ఆమిర్‌ ఖాన్‌-6, ఇతరులు- 6 శాతం, అజయ్‌ దేవ్‌గణ్‌-4, హృతిక్‌ రోషన్‌-4, రణ్‌వీర్‌ సింగ్‌-4, రణ్‌బీర్‌ కపూర్‌-2 శాతం ఓట్లతో మొదటి పది స్థానలలో చోటు సంపాదించుకున్నారు.

ఇక అటు హీరోయిన్ ల విషయానికి వచ్చేసరికి దీపికకు 16 శాతం ఓట్లతో ముందు స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాత ప్రియాంక చోప్రా- 14, కత్రినా కైఫ్‌- 13, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌-10, అనుష్క శర్మ- 9 శాతం, అలియా భట్‌తో పాటు కంగనా రనౌత్‌ 6 శాతం ఓట్లు వచ్చాయి. కపూర్‌ ఖాన్‌కు కేవలం 3 శాతం ఓట్లు వచ్చాయి. జూలై 15, 2020 మరియు జూలై 27, 2020 మధ్య ఈ సర్వే నిర్వహించడం జరిగింది.

ఇక దీపికా పదుకునే మొదటిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించబోతుంది. ఈ సినిమాని వైజయంతి సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.

Krishna

Krishna

Next Story