Drishyam2 Combo: "ట్వెల్త్ మ్యాన్" గా రాబోతున్న మోహన్ లాల్

12th Man - Mohanlal: 2013మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం చిత్రం ఘన విజయం సాధించడంతో

Sandeep Reddy
Published on: 7 July 2021 5:26 PM IST
Mohanlal Announced his New Movie 12th Man With Drishyam 2 Director Jeethu Joseph
X

మోహన్ లాల్ "ట్వెల్త్ మ్యాన్" మూవీ పోస్టర్ 

12th Man - Mohanlal: 2013మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం చిత్రం ఘన విజయం సాధించడంతో ఆ చిత్రాన్ని అటు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో పాటు టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ లు రీమేక్ చేసి అధ్బుతమైన విజయాన్ని సాధించారు. దృశ్యం విజయంతో ఆ చిత్ర యూనిట్ దృశ్యం చిత్రానికి కొనసాగింపుగా దృశ్యం రెండవ భాగం కూడా చిత్రీకరించి మలయాళంలో విడుదల చేయడంతో ఆ కథ కూడా నచ్చడంతో మరోసారి వెంకటేష్ దృశ్యం2 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి తన కెరీర్ లో మరో విజయాన్ని పొందాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల తర్వాత తాజాగా మోహన్ లాల్ హీరోగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని తాజాగా మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

ఆశీర్వాద్ సినీ బ్యానర్ పై నిర్మిస్తున్న"ట్వెల్త్ మ్యాన్" చిత్రానికి అంటోనీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. "ట్వెల్త్ మ్యాన్" గా తెరకేక్కబోతున్న ఈ చిత్రం దృశ్యం, దృశ్యం 2 చిత్రాల కంటే భిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరోపక్క ఈ చిత్ర కథ నచ్చితే తెలుగులో వెంకటేష్ రీమేక్ హక్కులు సొంతం చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాతగా వరుణ్ తేజ్ మరో హీరోగా తెరకెక్కుతున్న ఎఫ్3 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్, ఇప్పటికే షూటింగ్ మరియు డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న తమిళ రీమేక్ "నారప్ప" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా ఆరాట్టు సినిమాతో మలయాళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ మలయాళ సూపర్ స్టార్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story