Mohanlal New Movie: మరో సారి దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్

Mohanlal New Movie: దృశ్యం దర్శకుడు జీతూ, మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో నాలుగో చిత్రం చేయనున్నట్లు సమాచారం.

Kranthi
Published on: 3 July 2021 6:05 PM IST
Mohanlal and Jeethu Teams up Once Again for Mystery Thriller Movie
X

మరో సారి దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్

Mohanlal New Movie: మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన దృశ్యం సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ల‌యాళంలో మం‌చి విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ చేయగా.. రీమేక్ చేసిన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, తమిళ్‌లో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గన్ 'దృశ్యం'తో హిట్లు అందుకున్నారు.

దృశ్యం విడుద‌లైన ఆరేళ్ల త‌ర్వాత సీక్వెల్ తెర‌కెక్కించాడు జీతూ జోసెఫ్. క‌రోనా వ‌ల‌న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుడ‌ల చేయ‌గా, ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్‌కహ్మ‌ర‌థం ప‌ట్టారు. జీతూ, మోహన్‌లాల్‌ కలయికలో 'రామ్‌' అనే మరో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. తాజాగా జీతూ, మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. తాజాగా 'దృశ్యం 2' చిత్రం ఒమన్, ఖతార్‌ తదితర దేశాల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం ఇంకెంత సంచలనాలు రేపుతుందో చూడాలి.

Kranthi

Kranthi

Next Story