Akhil5: అఖిల్ సినిమాలో మోహన్‌లాల్?

Akhil5: కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని సురేంధర్ రెడ్డితో జతకట్టాడు.

Venkata Chari
Published on: 19 March 2021 6:12 PM IST
Mohan Lal to star in Akhil 5?
X
మోహన్ లాల్, అఖిల్ అక్కినేని (ఫొటో హన్స్ ఇండియా)

Akhil5: కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని సురేంధర్ రెడ్డితో జతకట్టాడు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం నటుడు ఇప్పటికే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు. అఖిల్ అక్కినేనిని చాలా స్టైలిష్ లుక్ లో చూపించేందుకు సురేంధర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. 'అఖిల్ 5' గా పిలిచే ఈ చిత్రంలో అఖిల్ గూఢాచారిగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, సురేంధర్ రెడ్డి ఓ కీలక పాత్ర పోషించేందుకు మోహన్ లాల్ ను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ చిత్ర నిర్మాతలు కూడా మోహన్ లాల్ అయితేనే ఈ పాత్రకు సరైన న్యాయం చేస్తాడని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. వారు ఇప్పటికే మోహన్ లాల్ తో చర్చలు ప్రారంభించారని వార్తలు వెలువడుతున్నాయి.

కాగా, మోహన్ లాల్ ప్రస్తుతం మలయాళి సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మోహన్ లాల్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అఖిల్, సురేందర్ రెడ్డిల కాంబో లో రాబోయే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story