'స‌న్ ఆఫ్ ఇండియా' స్టార్ట్ అయింది

స‌న్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది
x
Highlights

చాలా కాలం తరవాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అయన లీడ్ రోల్ లో 'స‌న్ ఆఫ్ ఇండియా' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

చాలా కాలం తరవాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అయన లీడ్ రోల్ లో 'స‌న్ ఆఫ్ ఇండియా' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజే (అక్టోబర్ 23) ప్రారంభమైంది. హైద‌రాబాద్‌లోని మోహ‌న్‌బాబు నివాసంలో ముహూర్త‌పు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. మంచు లక్ష్మి , విద్యా నిర్వాణ సంయుక్తంగా ముహూర్త‌పు షాట్‌ కొట్టగా, మంచు విష్ణు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్ష‌న‌ల్ టీమ్‌కు అందించారు. విరానికా మంచు, ఐరా, అవ్ర‌మ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు ఇప్పడు ఓ దేశభక్తి కథాశంతో ముందుకు రావడంతో అయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. ఇక ఈ సినిమాలోని నటీనటులని, సాంకేతిక నిపుణులని త్వరలో ఎంపిక చేయనున్నారు.అటు ఈ సినిమాకి మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తుండగా, స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories