Mohan Babu: శ్రీవారి సేవలో మంచు మోహన్‌బాబు...వంద కోట్ల ప్రాజెక్టుతో సినిమా తీస్తున్నాం..

Mohan Babu: దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం

Jyothi
Updated on: 1 Jun 2023 3:15 PM IST
Mohan Babu Visits Tirumala
X

Mohan Babu: శ్రీవారి సేవలో మంచు మోహన్‌బాబు...వంద కోట్ల ప్రాజెక్టుతో సినిమా తీస్తున్నాం..

Mohan Babu: తిరుమల శ్రీవారిని సినీ నటుడు మంచు మోహన్ బాబు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మోహన్ బాబు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా... ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ ఏడాది మొట్టమొదటి సారిగా శ్రీనివాసుడి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు మోహన్‌బాబు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు చక్కగా జరుగుతుందన్నారు. దాదాపు వంద కోట్ల ప్రాజెక్టుతో సినిమా తీస్తున్నాంమని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాంమని మంచు మోహన్ బాబు అన్నారు..

Jyothi

Jyothi

Next Story