నేను కసక్ అంటే అందరూ ఫసక్ Son of India టీజర్

Son Of India Ttriler Release
x

Son of India File Photo

Highlights

Son of India:కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్న సినిమా ''సన్ ఆఫ్ ఇండియా'.

Son of India: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్న సినిమా ''సన్ ఆఫ్ ఇండియా'. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ - శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకాలపై మంచు విష్ణు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ తో స్టార్ట్ అవుతుంది. 'మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను' అంటూ చిరంజీవి వాయిస్ హైలెట్స్ గా నిలిచింది. 'తన రూటే సపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో.. ఆ దేవుడికే ఎరుక' అంటూ ఇందులో మోహన్ బాబు పాత్ర స్వభావాన్ని తెలియజేసారు. చివర్లో 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అని మోహన్ బాబు చెప్పడం గమనార్హం.

ఫ‌స‌క్ అనే డైలాగ్ గ‌తంలో మోహ‌న్ బాబు చెప్పిన విష‌యం తెలిసిందే. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న ఫ‌స‌క్ అంటూ చెప్పారు. దీంతో ఈ డైలాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయిన 'ఓన్లీ వన్స్ ఫసక్. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి , ఆలీ, వెన్నెల కిషోర్ , పృథ్వీరాజ్ , రాజా రవీంద్ర , రఘుబాబు , రవి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories