మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా'జయ జయ మహావీర' లిరికల్ సాంగ్ విడుదల

Son Of India: 'సన్నాఫ్ ఇండియా'జయ జయ మహావీర' లిరికల్ సాంగ్‌ను అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు.

Kranthi
Updated on: 15 Jun 2021 2:55 PM IST
Mohan Babu  Son Of India Jaya Jaya Mahavera Lyrical Song Released
X

జయ జయ మహావీర లిరికల్ సాంగ్ (ఫైల్ ఇమేజ్)

Son Of India: నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా' సినిమాకు సంబంధించిన 'జయ జయ మహావీర' లిరికల్ సాంగ్‌ను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఇప్పటికే చిరంజీవి వాయిస్ ఓవర్‌తో విడుదలైన 'సన్నాఫ్ ఇండియా' టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. 'సన్నాఫ్ ఇండియాను చిత్రానికి మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.

చాలా కాలం తర్వాత మోహన్ బాబు పూర్తి స్థాయి మాస్ ఓరియంటెడ్ మూవీతో పలకరించబోతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు విభిన్న గెటప్‌లో కనిపించనున్నారు. దాదాపు 500 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో మెప్పించిన మోహన్ బాబు.. ఇపుడు సన్నాఫ్ ఇండియా అంటూ దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తుండగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story